ఉదయం పూట టీ (Tea) కాఫీ కి బదులుగా గోరు వెచ్చని నీళ్లు తాగితే బరువు తగ్గొచ్చు
వేళకు ఆహారం తినకపోవడం కారణంగా అనారోగ్య (Unhealthy) సమస్యలు మెండుగా వస్తాయి. మళ్లీ వాటిని తగ్గించుకోవడానికి ఆసుపత్రుల చుట్టూ తిరగాల్సి వస్తుంది. అప్పటికే కష్టపడి సంపాదించిన డబ్బులు కూడా అనారోగ్యానికి పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది. అయితే మనం రోజు తినే ఆహారంలో (food) గానీ, తినే సమయం (Time) గాని.. తూచా తప్పకుండా సరైన పద్ధతిలో వెళితే ఆరోగ్యం మన చెంతే ఉంటుంది. ప్రతీ ఒక్కరికి బరువు (weight) అనేది ప్రమాదకరమే. దాని వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తుంటాయి. అందుకే డాక్టర్లు వ్యాయామాలు (exercises) చేయడం మంచిదని సలహాలు (weight loss tips) ఇస్తుంటారు. అయితే దానికోసం రకరకాల ఎక్సర్సైజ్లు చేయడం మొదలు పెడతారు. ఒకటి రెండు రోజులు చేయగానే బద్దకంతోనో, పని ఒత్తిడితోనో మధ్యలోనే మానేస్తుంటారు. దీనివల్ల బరువు తగ్గాలన్న (weight loss) కల.. కలగానే ఉండిపోతుంటుంది. మీరు బరువు తగ్గాలని (weight loss) తీవ్రంగా ప్రయత్నిస్తున్నప్పటికీ, మీకు ఏదీ సరిగ్గా పని చేయనట్లయితే ఈ పద్దతి సరిగా పాటించండి. నిద్రపోవడం (sleep mandatory) వంటి విశ్రాంతి కూడా మీకు కిలోల బరువు తగ్గడానికి (weight loss) సహాయపడుతుంది.