ఏ సమయంలో భద్రతా మండలి అధ్యక్ష హోదాలో భారత్ వ్యవహరించనుంది?
1. 2021 ఆగస్టు మరియు 2022 డిసెంబర్
2. 2021 సెప్టెంబర్ నుండి 2022 డిసెంబర్
3. 2022 డిసెంబర్ మరియు 2023 ఆగస్ట్
4. 2021 డిసెంబర్ నుండి 2023 ఆగస్ట్
జవాబు: 1
వివరణ:- ఐక్యరాజ్యసమితి లోని కీలకమైన భద్రతా మండలి అధ్యక్ష హోదాలో ఆగస్ట్ 1 నుండి 31 వరకు వ్యవహరించనుంది. సముద్ర ప్రాంత రక్షణ, శాంతి పరిరక్షణ, ఉగ్రవాద నిర్మూలన వంటి ప్రధాన అంశాలపై జరిగే కీలక చర్చలకు నేతృత్వము వహించ నుంది. 2022 డిసెంబర్ లో కూడా ఈ అవకాశం భారత్ కు దక్కనుంది. వివిధ దేశాలకు పంపే శాంతి పరిరక్షణ దళాల భద్రతకు మెరుగైన సాంకేతికతను వినియోగించడం , దళాలపై దాడులకు పాల్పడే వారని చట్టం ముందు నిలబెట్టే విషయమై భారత్ దృష్టి సారిస్తుంది.
Comments
Post a Comment