దేశంలో అత్యంత సంపన్న గ్రామం….ఆ గ్రామవాసుల ప్రతి రెండో కుమార్తె వివాహాన్ని గ్రామస్థులే జరిపించడం విశేషం!
దేశంలో అత్యంత సంపన్న గ్రామం….ఆ గ్రామవాసుల ప్రతి రెండో కుమార్తె వివాహాన్ని గ్రామస్థులే జరిపించడం విశేషం!
మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్ జిల్లా హివారే బజార్ గ్రామం. అన్ని గ్రామాలలాగే ఆ గ్రామం కూడా ఒకప్పుడు ఉండేది. కానీ పొపట్‌రావు పవార్ ఆ గ్రామ సర్పంచ్ అయ్యాక ఆ గ్రామ రూపురేఖలే మారిపోయాయి. ఆయన సర్పంచ్ గా ఆ గ్రామాన్ని ఎంతగానో అభివృద్ధి చేశారు. ఒకప్పుడు ఆ గ్రామం కరువు కాటకాలతో తీవ్రమైన దుర్భర పరిస్థితుల్లో ఉండేది. కానీ ఆయన వర్షపు నీటిని సేకరించి నిల్వ చేసే పద్ధతులను నేర్పాడు. దీంతో నీటి కరువు తీరింది. పంటలు సమృద్ధిగా పండాయి.
- ఆ గ్రామం ఇప్పుడు మస్కిటో ఫ్రీ జోన్ గా ఉంది. అంటే అక్కడ చిన్న దోమ మనకు కనిపించదు. అలాగే బహిరంగ మలమూత్ర విసర్జన రహిత గ్రామంగా మారింది. ప్రతి ఇంట్లోనూ బయోగ్యాస్‌ను వాడుతారు. ఆ గ్రామవాసుల ప్రతి రెండో కుమార్తె వివాహాన్ని గ్రామస్థులే జరిపిస్తారు. చెట్లను నరికివేయడాన్ని నిషేధించారు. ఇలా అనేక గొప్ప కార్యక్రమాలు చేపట్టారు. కనుకనే ఆ గ్రామం అత్యంత ధనికులు ఉన్న గ్రామంగా పేరుగాంచింది. ఇదంతా సర్పంచ్ పవార్ చలవే అని చెప్పవచ్చు.
Comments
Post a Comment