దేశవ్యాప్తంగా స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని చేపట్టి నందుకు గాను ఏ ఫౌండేషన్ ప్రధాని మోడీకి ‘గ్లోబల్ గోల్ కీపర్’ అవార్డు ప్రదానం చేసింది

ప్రధాని నరేంద్ర మోడీకి మరో అరుదైన గౌరవం దక్కింది. ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం దేశవ్యాప్తంగా స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని చేపట్టిన సంగతి తెలిసిందే.  దీనికి  ‘బిల్ అండ్ మిలిందా గేట్స్ ఫౌండేషన్’ మోడీకి ‘గ్లోబల్ గోల్ కీపర్’ అవార్డు ప్రదానం చేసింది. మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ చేతుల మీదుగా ప్రధాని మోదీ ఈ అవార్డును అందుకున్నారు. 
ఈ సందర్భంగా మోడీ మాట్లాడుతూ… ఇది తన ఒక్కడికే దక్కిన గౌరవం కాదని…యావత్ భారతీయులందరిదీనని అన్నారు. స్వచ్ఛ భారత్ అభియాన్ విజయవంతం కావడానికి కారణమైన  భారతీయులందరికీ ఈ గౌరవం దక్కుతుందని మోడీ అన్నారు. భారత జాతిపిత మహాత్మాగాంధీ 150వ జయంతి వేడుకలను  దేశవ్యాప్తంగా అక్టోబర్ 2న జరుపుకోనున్న ఈ  సంవత్సరంలోనే ఈ అవార్డు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉందన్నారు.

దేశవ్యాప్తంగా స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని చేపట్టి నందుకు గాను  ఏ  ఫౌండేషన్  ప్రధాని మోడీకి ‘గ్లోబల్ గోల్ కీపర్’ అవార్డు ప్రదానం చేసింది
1. బిల్ అండ్ మిలిందా గేట్స్ ఫౌండేషన్’
2. గ్రీన్ వే ఇంటర్ నేషనల్ పౌండే ష న్ 
3. క్లీన్ అండ్ గ్రీన్ పౌండే ష న్ 
4. ఎనర్జీ అండ్ ఎన్విరాన్మెంట్ పౌండే ష న్ 
Answer. 1

Comments