శ్రావణమాసం ప్రారంభమైంది.
2020, జులై 21వ తేదీ మంగళవారం నుంచి ప్రారంభమైన ఈ మాసాన్ని
శుభాల మాసంగా పిలుస్తుంటారు. ఇది ఒక విధంగా అధ్యాత్మిక మాసం అని చెప్పవచ్చు. ఈ నెలలో అన్ని రోజులు మంచివే. పలు పండుగలు ఈ నెలలో వస్తాయి.
శుభాల మాసంగా పిలుస్తుంటారు. ఇది ఒక విధంగా అధ్యాత్మిక మాసం అని చెప్పవచ్చు. ఈ నెలలో అన్ని రోజులు మంచివే. పలు పండుగలు ఈ నెలలో వస్తాయి.
రాఖీపౌర్ణమి,
హయగ్రీవ జయంతి,
శ్రీకృష్ణాష్టమి,
పొలాల అమావాస్య,
నాగుల పంచమి,
వరలక్ష్మీ వ్రతం తదితర పండుగలు ఈ నెలలో వస్తాయి. ఈ మాసం ప్రధానంగా మహిళలకు ప్రత్యేకమైనది. ప్రతి ఇంట్లో పూజలతో అధ్యాత్మిక వాతావరణం ఉంటుంది.
ఆలయాల్లో ప్రత్యేక పూజలు, అర్చనలు, ఇతర విశేషాలు జరుగుతుంటాయి. కానీ ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో కరోనా వైరస్ విస్తరిస్తున్న క్రమంలో…ఆలయాల్లో అంతస్థాయిలో రద్దీ లేదు. ఇంట్లోనే తోచిన విధంగా పూజలు చేసుకుంటున్నారు.
శ్రావణమాసం ప్రత్యేకతలు, ఆచరించాల్సిన నియమాలు : –
శుక్రవారం : ప్రతి శుక్రవారం ఎంతో ప్రాధాన్యమైంది. వరలక్ష్మీ వ్రతాన్ని కొంతమంది ఆచరిస్తుంటారు. మహాలక్ష్మి విగ్రహానికి అలంకరణ చేసి ఇరుగు, పొరుగు, బంధువులను పిలిచి వ్రతాన్ని నిర్వహిస్తారు. వచ్చిన వారికి తాంబూళం, శనగల ప్రసాదం ఇస్తారు.
ప్రతి ముత్తైదువును మహాలక్ష్మి రూపంగా భావించి గౌరవిస్తారు. వ్రతం చేసిన ముత్తైదువులు తోటి ముత్తైదువులకు గారెలు, పూర్ణాలు, తోచిన విధంగా వాయినాలు ఇస్తుంటారనే సంగతి తెలిసిందే. ఈ వ్రతాన్ని చేసే వారికి అన్ని శుభ శకునాలే కలుగుతాయని నమ్మకం. ఆలయాల్లో, ఇంట్లో కుంకుమార్చనలు చేస్తుంటారు. నవ వధువులతో తప్పనిసరిగా ఈ వ్రతం చేయిస్తుంటారు.
Comments
Post a Comment