పదో తరగతి విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. కరోనా కారణంగా సొంత ప్రాంతాలకు వెళ్లిపోయిన విద్యార్థులు వారి సొంత ప్రాంతాల్లోనే పరీక్షలు రాసేందుకు అనుమతిచ్చింది.
ప్రైవేట్ స్కూళ్ల హాస్టళ్లలో ఉండి చదువుకున్న విద్యార్థులు కరోనా లాక్‌డౌన్ కారణంగా వారంతా సొంత ప్రాంతాలకు వెళ్లిపోయారు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో తిరిగి రావడం కష్టం కాబట్టి ఎక్కడి వారిని అక్కడే.. తమ సొంత ప్రాంతాల్లో లేదా దగ్గర పరీక్ష కేంద్రంలో పరీక్ష రాసే అవకాశం కల్పించారు.
ఈ మేరకు విద్యార్థుల వివరాలను తమ జిల్లా డీఈవోలకు పంపించాలని విద్యాశాఖ ఆదేశించింది. మరోపక్క పది పరీక్షలపై ఇంకా ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. శుక్రవారం విచారణ చేపట్టిన కోర్టు.. శనివారం రోజుకు వాయిదా వేసింది.
కంటైన్మెంట్ జోన్లలో ఉండే విద్యార్థుల పరిస్థితి ఏమిటని, సప్లిమెంటరీ ఎగ్జామ్స్ గురించి హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. దీంతో ప్రభుత్వాన్ని సంప్రదించిన తర్వాత రేపు నిర్ణయం తెలుపుతామని అడ్వకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ సమాధానమిచ్చారు. దీంతో తదుపరి విచారణ రేపటికి వాయిదా పడింది.
టెన్త్ పరీక్షల షెడ్యూల్
▪జూన్ 8న ఇంగ్లీష్ పేపర్-1
▪జూన్ 11న ఇంగ్లీష్ పేపర్-2
▪జూన్ 14న మ్యాథ్స్ పేపర్-1
▪జూన్ 17న మ్యాథ్స్ పేపర్-2
▪జూన్ 20న సైన్స్ పేపర్-1
▪జూన్ 23న సైన్స్ పేపర్-2
▪జూన్ 26న సోషల్ స్టడీస్ పేపర్-1
▪జూన్ 29న సోషల్ స్టడీస్ పేపర్-2

Comments
Post a Comment