ఈ అమ్మాయి రాత్రికి రాత్రే సెలబ్రిటీ అయిపోయింది.

భారత సంతతికి చెందిన ఈ విద్యార్థిని పేరు వనీజా రూపాణీ.. వయసు 17 ఏళ్లు. 
అమెరికా దేశంలోని అలబామా రాష్ట్రంలోని నార్త్‌ పోర్ట్‌లో 11వ తరగతి చదువుతోంది. 
నాసా నిర్వహించిన 'నేమ్‌ ద రోవర్‌' పోటీకి ఒక వ్యాసాన్ని పంపింది. ఇందులో అంగారక గ్రహంపై విహరించడానికి నాసా మొట్టమొదటి సారిగా పంపుతున్న హెలికాఫ్టర్‌ (గ్రహాంతర వ్యోమ నౌక)కు ఇన్‌జెన్యునిటీ (చాతుర్యం) అనే పేరైతే బాగుంటుందని సూచించింది. నాసా కూడా ఈ పేరునే ఖరారు చేసింది. దీంతో ఈ అమ్మాయి రాత్రికి రాత్రే సెలబ్రిటీ అయిపోయింది.
This student of Indian origin is Vanija Rupani .. age 17 years. The 11th grade is studying in North Port, Alabama, USA. NASA's "Name the Rover" sent an article to the competition. In this case, the helicopter that NASA sends for the first time on Mars is called Ingenuity. NASA has also finalized the name. The girl became a celebrity overnight.


హెలికాఫ్టర్‌కు పేరు పెట్టడానికి 12వ తరగతి లోపు విద్యార్థుల నుంచి 'నాసా' వ్యాసాలను ఆహ్వాంనించగా 28 వేల మంది పంపారు. వీటిలో వనీజా రాసిన వ్యాసంలోని అంశాలు నాసా పెద్దలను ఆకర్షించాయి. గ్రహాంతర యాత్రల్లో ఎదురవుతున్న సవాళ్లను అధిగమించడానికి పరిశోధకులు ప్రదర్శిస్తున్న చాతుర్యం (ఇన్‌జెన్యునిటీ), తెలివితేటల వల్ల మనం అంతిరిక్షంలో జరుగుతున్న అద్భుతాలను మనం చూడగలుగుతున్నాం.

అమోఘమైన విజయాలు సాధించడానికి, విశ్వం అంచుల వరకూ మన ఆలోచన పరిధులను విస్తరించానికి ఈ చాతుర్యం దోహదపడుతుందని వనీజా తన వ్యాసంలో పేర్కొంది. చిన్ననాటి నుంచి సైన్స్‌ పట్ల మక్కువ కలిగిన వనీజా ఈ హెలికాఫ్టర్‌ ప్రాజెక్ట్‌ ఒక అద్భుతమని తెలిపింది. అందులో తను పాలుపంచుకోవడం మరితం ఉత్సాహాన్నిస్తోందని వెల్లడించింది.

ఇన్‌జెన్యునిటీ, పర్‌సెవరెన్స్‌లు పేరిట రెండు రోవర్‌లను ఈ ఏడాది జులైలో నాసా ప్రయోగించనుంది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో అవి అంగారకుడిని చేరుకుంటాయి. అక్కడి జెజెరో బిళం వద్ద పరిశోధనలు చేస్తాయి. అయితే ఇందులో ఇన్‌జెన్యునిటీ మాత్రం గగన విహారం కోసం ప్రయత్నించనుంది.

Comments