Disha murder: దిశా నిందితులను ఎన్ కౌంటర్ చేసిన పోలీసులు.. షాద్ నగర్ లోనే ... సరిగ్గా ఆ సమయానికే




Disha murder: దిశా నిందితులను ఎన్ కౌంటర్ చేసిన పోలీసులు.. షాద్ నగర్ లోనే ... సరిగ్గా ఆ సమయానికే



దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హైదరాబాద్ వెటర్నరీ డాక్టర్ దిశ హత్య కేసులో శుక్రవారం కీలక పరిణామం చోటుచేసుకుంది. నలుగురు నిందితులను పోలీసులు ఎన్‌కౌంటర్‌లో హతమార్చారు.

నిన్న ఉదయం నలుగురు నిందితులను కస్టడీలోకి తీసుకున్న పోలీసులు రహస్య విచారణ చేపట్టారు. ఇప్పటికే 7 బృందాల పోలీసులు ఈ కేసు విచారణలో నిమగ్నమై పని చేస్తున్నారు. ఇదే సమయంలో రాత్రి సంఘటనా స్థలంలో సీన్‌ రీ కన్‌స్ట్రక్షన్ చేస్తుండగా నలుగురు నిందితులు తప్పించుకునేందుకు పరుగులు పెట్టారు. దీంతో.. పోలీసులు వారి ఎన్‌కౌంటర్ చేశారు. దిశ హత్యాచారం కేసులో..
జొల్లు శివ, మహమ్మద్, జొల్లు నవీన్, చెన్నకేశవులు చనిపోయారని పోలీసులు నిర్ధారించారు . ఇదే విషయాన్ని కొద్దిసేపటి క్రితం అధికారికంగా వెల్లడించారు పోలీసులు. గత రాత్రి సీన్ రీ కన్‌స్ట్రేషన్ చేస్తుండగా.. నలుగురు తప్పించుకునేందుకు ప్రయత్నించారని.. దీంతో.. వారిపై.. కాల్పులు జరపక తప్పలేదని.. నలుగురు నిందితులు అక్కడికక్కడే చనిపోయినట్టు పోలీసులు తెలిపారు. చటాన్ పల్లి బ్రిడ్జ్ సమీపంలో, ఎక్కడైతే దిశను హతమార్చారో సజీవ దహనం చేశారో అక్కడే వారిని కూడా ఎన్‌ కౌంటర్ చేశారు.


Comments