ప్రధాని నరేంద్ర మోడీకి రష్యా అత్యున్నత పౌర పురస్కారం

భారత ప్రధాని నరేంద్రమోడీ కి రష్యా తమ దేశ అత్యున్నత పౌర పురస్కారమైన 'ఆర్డర్ ఆఫ్ సెయింట్ ఆండ్రూ డి అపోస్టల్ ను ప్రకటించింది. భారత్ రష్యా ల ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషించినందుకు ఈ అవార్డు అంద జేస్తున్నట్లు రష్యా ప్రభుత్వం తెలిపింది. భారత్-రష్యాల మధ్య ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని పెంపొందించడంలో అసామాన్య కృషికి, ఉభయ దేశాల మధ్య స్నేహ సంబంధాలు మెరుగుపరిచినందుకు గాను ఎంపిక చేసినట్లు తెలిపారు. ఈ అవార్డును రాజనీతిజ్ఞులకు, ప్రజాదరణ పొందిన వ్యక్తులకు, శాస్త్ర సాంస్కృతిక, కళా రంగాలలో గుర్తింపు తెచ్చుకున్న వారికి ఇస్తారని తెలిపారు.

Comments