మడగాస్కర్: ప్రేయసిని గెలవడానికి మీరు ఎద్దుతో కుస్తీ పట్టగలరా?

మడగాస్కర్: ప్రేయసిని గెలవడానికి మీరు ఎద్దుతో కుస్తీ పట్టగలరా?

ఆఫ్రికాలోని మడగాస్కర్ పర్వత గ్రామాల్లో నివసించే బెట్సీలియో ప్రజలు శతాబ్దాలుగా ‘‘సావికా’’ అనే సాహస క్రీడ ఆడుతుంటారు. బరిలో కట్టు వదిలేసిన ఎడ్లతో వట్టి చేతులతో కుస్తీ పట్టే ఆట అది. అవివాహితులైన యువకులు తమ శక్తి సాహసాలను ప్రదర్శించి యువతుల మనసు గెలుచుకోవడం ఆ ఆట లక్ష్యం.
ఆండీ రఫానాంబినాన్ట్సోవా అవివాహిత యువకుడు. తనకో ప్రేయసి కావాలన్నది అతడి ప్రగాఢ కాంక్ష. అందుకోసం ఎద్దుతో కుస్తీ పోటీకి దిగాడు.
ఈ సంప్రదాయ మలగాసీ సావికా క్రీడలో ఎడ్లకు ఎలాంటి హానీ చేయరు. ఎడ్లను అక్కడ పవిత్రమైనవిగా భావిస్తారు.

Comments