సామాన్యుడి చేతిలో పాశు పతాస్త్రం ఓటు. దాన్ని సరిగా సందిస్తే దేశం సరైన దిశలో పురోగమిస్తుంది. దానిని ఉపయోగించుకోకుండా బద్ద కిస్తే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు.అందుకే ఓటింగ్ శాతం పెంచేందుకు ఓటర్లలో చైతన్యం తీసుకొచ్చేందుకు ఎన్నికల సంఘం కృషి చేస్తోంది.ఈ ప్రయత్నంలో భాగంగా మహారాష్ట్ర ప్రధాన ఎన్నిక అధికారి తాజా గా 12 మంది ప్రచార కర్తలను నియమించారు. ఓటు హక్కు వినియోగంపై రాష్ట్ర ప్రజలలో అవగాహన పెంచడం వీరి కర్తవ్యం. ఈ 12 మందిలో ఒకరు ట్రాన్స్ జెండర్. పెరు గౌరి సావంత్. వయసు 38 ఏళ్ళు. మన దేశంలో ఎన్నిక ల ప్రచార కర్తగా నియమితులైన తొలి ట్రాన్సజెండార్ తనే. చాలామంది సెక్స్ వర్కర్లు, ట్రాన్సజెండర్లు, మహిళలు ఓటు హక్కు వింయోగించుకోవటం లేదని , వారందరూ ఈ దఫా పోలింగ్ కేంద్రాలకు వచ్చేలా కృషి చేస్తానని సావంత్ చెప్పారు.
Comments
Post a Comment