పిల్లలను ప్రోత్సహించే పంచాయతీ కి చైల్డ్ ఫ్రెండ్లీ అవార్డు రూపకల్పన

పిల్లల్ని ప్రోత్సహించే పంచాయతీ కి జాతీయ పురస్కారం అందించేందుకు కేంద్రప్రభుత్వం కొత్త అవార్డు ను రూపొందించింది.
8 రకాల అంశాలకు లభించే మార్కుల ప్రాతిపదికన కేంద్రం పంచాయతీ లను ఎంపిక చేస్తుంది.
1. పిల్లలకు వ్యాధినిరోధక టీకాలు వేయించడం
2.పాఠశాలలో పిల్లలు ఎక్కువమంది చేరడం
3.ఉపాధ్యాయుల హాజరుశాతం
4.పాఠశాలను మధ్యలో మానేస్తున్న పిల్లల సంఖ్య తక్కువగా ఉండడం
5.పంచాయతీ కి ఆరుబయట విసర్జన రహిత హోదా కలిగి ఉండటం
6.బాలికల్లో పరిశుభ్రత , యుక్త వయసు వారికి ఋతు రుమాళ్ళ అందజేత
7.మధ్యాహ్న భోజనం పథకం అమలు
8.పిల్లల్లో పోషకాహార స్థాయి

పంచాయతీలను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న అవార్డుతో పాటు  ఈ చైల్డ్ ఫ్రెండ్లీ గ్రామ పంచాయతీ అవార్డు ను జాతపరచింది. ఈ అవార్డును ప్రతి ఏటా పంచాయతీ రాజ్ దినోత్సవాన్ని నిర్వహించే ఏప్రిల్ 24 న అందించనుంది.

Comments