స్టీవ్ జాబ్స్*.. ఏడు వందల కోట్ల డాలర్ల ఆస్తిపరుడు. 56 ఏళ్ల వయసులో.. క్లోమగ్రంధి కాన్సర్ వ్యాధితో చనిపోయే ముందు చెప్పిన చివరి మాటలు:
*స్టీవ్ జాబ్స్*.. ఏడు వందల కోట్ల డాలర్ల ఆస్తిపరుడు. 56 ఏళ్ల వయసులో.. క్లోమగ్రంధి కాన్సర్ వ్యాధితో చనిపోయే ముందు చెప్పిన చివరి మాటలు: పరుల దృష్టిలో నా జీవితం విజయానికి ఒక చిహ్నం.. కానీ పని తప్ప నాకు సంతోషం గురించి తెలియదు. నాకు అలవాటైన పని సంపాదన అనే ఒక విషయం మాత్రమే. రోగంతో లేవలేని స్థితిలో.. నా జీవితాన్ని నెమరు వేసుకుంటే, మరణం ముందర నా సంపాదన, నా పేరు ప్రఖ్యాతులు ఎందుకూ కొరగానివని నాకు తెలిసివచ్చింది. నీ కారు నడపటానికి ఒక డ్రైవరును పెట్టుకోవచ్చు, బాగా డబ్బు సంపాదించవచ్చు, కానీ.. నీ రోగాన్ని భరించడానికి ఎవ్వరినీ అద్దెకు తెచ్చుకోలేవు. ఇహలోక సుఖాలన్నీ పొందవచ్చు, కానీ.. ఒక ఆరోగ్యాన్ని పోగొట్టుకొన్న తర్వాత దానిని ఎప్పటికీ పొందలేవు.. అదే *జీవితం*. అందుకే మంచిగా జీవించు, ఇతరులను సంతోషపెట్టు. మనం వృద్ధాప్యాన్ని సమీపించినప్పుడు చురుకుగా తయారవుతాం.. అప్పుడు మనకు జ్ఞానోదయం అవుతుంది. 30 డాలర్ల గడియారమైనా, 300 డాలర్ల గడియారమైనా.. ఒకే సమయాన్ని సూచిస్తుంది. మన జేబులో 30 డాలర్లున్నా, 300 డాలర్లున్నా.. అందులో తేడా ఏమీ వుండదు. ముప్పై వేల డాలర్ల కారైనా, లక్షా యాభైవేల కారైనా.. ప్రయాణించే దూరం, బాట ఒకట